ఎమ్మెల్యే ‘GMR’కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్టులు

GMR : పటాన్ చెరు, తెలంగాణ చౌరస్తా: పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికు పటాన్ చెరు జర్నలిస్టులు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన పుట్టిన రోజు సందర్భంగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి శనివారం సాయంత్రం పటాన్ చెరు చేరుకున్నారు. ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి తిరుపతి నుంచి తిరిగి వచ్చిన విషయాన్ని తెలుసుకుని పలువురు నాయకులు, కార్యకర్తలు పటాన్ చెరు పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరితో పాటు జర్నిస్టులు సయ్యద్ సులేమాన్, శ్రీనివాస్, రాజు, కిషోర్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేను శాలువాతో సత్కరించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.