How to Boost Child Immunity: ఈ ప్రపంచంలో ప్రతి తల్లిదండ్రికి పిల్లల ఆరోగ్యమే(Children’s Health) మొదటి ప్రాధాన్యత. జబ్బులకు బలహీనంగా మారకుండా వారి రోగనిరోధక శక్తిని(Child Immunity) పెంచాలని తపన ప్రతి తల్లిదండ్రిలో ఉంటుంది. మంచి ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా ప్రతిరోజూ రోగనిరోధక శక్తిని పెంపొందించే ఆహార పదార్థాలను పిల్లలకి పెట్టడం ద్వారా పిల్లల ఆరోగ్యాన్ని మెరుగుపరచవచ్చు.
NOTE : మీ బిడ్డ తరచూ జబ్బులు పడుతున్నట్లైతే, తక్షణమే వైద్యుని సంప్రదించడం అత్యవసరం. సరైన నిర్ధారణ, చికిత్స కోసం వైద్యుల సూచనలు తప్పనిసరిగా తీసుకోవాలి.
పిల్లల రోగనిరోధక శక్తిని పెంచే ముఖ్యమైన ఆహారాలు
1. పెరుగు (Yogurt)
పెరుగు అనేది పిల్లల రోగనిరోధక శక్తిని పెంచే అత్యంత ముఖ్యమైన ఆహారాలలో ఒకటి. ఇందులో ఉండే ప్రొబయోటిక్స్ జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి. కేల్షియం, పొటాషియం, విటమిన్ D వంటి ముఖ్యమైన పోషకాలు ఇందులో ఉంటాయి. తీపి లేని, లౌ ఫ్యాట్ పెరుగు వాడితే మంచి ఫలితం కలుగుతుంది. పరిశోధనలు ప్రకారం, రోజూ పెరుగు తీసుకునే పిల్లలు జలుబు, కంటి నొప్పి, గొంతు ఇన్ఫెక్షన్లకు తక్కువగా గురవుతారు.
2. సిట్రస్ ఫ్రూట్స్(Citrus Fruits)..
ఆరెంజ్, ముసంబి, నిమ్మ, కమలా వంటి పండ్లలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తుంది. అలాగే వీటిలో పొటాషియం, మాగ్నీషియం, బి విటమిన్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరాన్ని వైరస్, బ్యాక్టీరియా వంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
3. ఆకుకూరగాయలు(Leafy Vegetables)..
బ్రోకలీ, కాలిఫ్లవర్, పాలకూర, కాబేజి లాంటి ఆకుకూరలు విటమిన్లు A, C, K, ఐరన్, మాగ్నీషియం, ఫైబర్ లాంటి పోషకాలు కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో టాక్సిన్లను తొలగించడంలో సహాయపడతాయి. రోజూ ఆకుకూరలు తినిపించడం వల్ల పిల్లల ఆరోగ్యంపై దీర్ఘకాలిక లాభాలు ఉంటాయి.
4. చికెన్, చేపలు, ఇతర నాన్-వెజ్(Chicken, Fish, Other Non— V–eg)..
లీన్ మీట్, పౌల్ట్రీ, ఫిష్ లాంటి మాంసాహారాల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. ఇది శరీరంలో వైట్ బ్లడ్ సెల్స్ (WBCs) ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. చేపలలో ఉండే ఒమెగా-3 ఫ్యాటీ ఆమ్లాలు మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అలాగే, జింక్, ఐరన్, విటమిన్ B లాంటి పోషకాలు కూడా ఉండడం వల్ల రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది.
5. బెరీస్ (Blueberries, Strawberries etc..)
బెరీస్లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల శరీరాన్ని ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి రక్షిస్తాయి. ఇవి రుచి పరంగా పిల్లలకు ఇష్టమైనవే కాకుండా, ఆరోగ్యపరంగా కూడా గొప్ప ప్రయోజనాలు కలిగిస్తాయి.
6. నట్స్ & సీడ్స్(Nuts & Seeds)..
సన్ఫ్లవర్, పంప్కిన్, చియా, ఫ్లాక్స్ విత్తనాలు విటమిన్ E, హెల్తీ ఫ్యాట్స్, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు అధికంగా కలిగి ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా, రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో కూడా సహాయపడతాయి.
7. ఓట్స్ (Oats)
ఓట్స్ అనేవి పూర్తి ఆరోగ్యకరమైన ధాన్యం.. వీటిలో ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు ఉంటాయి. ఇవి జీర్ణవ్యవస్థకు మేలు చేస్తూ శరీరానికి రక్షణ కల్పిస్తాయి. పెరిగే పిల్లల రోజువారీ డైట్లో ఓట్స్ చేర్చడం మంచిది.
8. గుడ్లు(Eggs)
గుడ్లు సమగ్ర పోషకాహారం. వీటిలో విటమిన్ A, D, B12, సెలెనియం, జింక్ వంటి పోషకాలు ఉంటాయి. ప్రొటీన్లు అధికంగా ఉండటంతో పిల్లల శక్తి స్థాయిలను పెంచుతాయి. పచ్చిగా ఉండే గుడ్లలో మేలైన పోషకాలు లభిస్తాయి.
9. పసుపు (Turmeric)
ఆయుర్వేదంలో ప్రాముఖ్యత కలిగిన పసుపు యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీబాక్టీరియల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలతో ప్రసిద్ధి చెందింది. ఒక గ్లాస్ వెచ్చని పాలలో ఒక చెంచా పసుపు వేసి పిల్లలకు ఇవ్వడం ద్వారా రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
ఈ ఆహారాలను రోజువారీ భోజనంలో చేర్చడం ద్వారా పిల్లల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. అయితే, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నప్పటికీ పిల్లలు తరచూ జబ్బుపడుతూ ఉంటే, వెంటనే అనుభవజ్ఞులైన డాక్టరును సంప్రదించడం ఉత్తమం.
మీ పిల్లల ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది. సరైన ఆహారం ఇంకా సరైన వైద్య సహాయం ద్వారా మీ పిల్లలు ఆరోగ్యవంతమైన బాల్యాన్ని పొందుతారు!