Rajasthan Gang Rape: రాజస్థాన్ రాష్ట్రంలోని అల్వార్ జిల్లాలో(Alwar District) ఒక మహిళను కిడ్నాప్ చేసి, ఏడుగురు వ్యక్తులు ఆమెపై వరుసగా అత్యాచారం చేసిన అమానుష ఘటన(Crime) వెలుగులోకి వచ్చింది. బాధితురాలు ను 11 రోజుల పాటు బంధించి ఈ దారుణానికి ఒడిగట్టారు దుండగులు.
Rajasthan Gang Rape – ఏమి జరిగిందంటే..?
2025 ఏప్రిల్ 24 రాత్రి, బయటకి వెళ్లిన సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆమెను బలవంతంగా బొలెరో వాహనంలో ఎక్కించారు. అనంతరం పానియాలా రోడ్ సమీప ప్రాంతానికి తీసుకెళ్లి వాహనంలోనే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత ఇంకో ముగ్గురు వ్యక్తులు చేరి మొత్తం ఏడుగురు ఆమెను మానసిక, శారీరకంగా వేధించారు.
Also Read: పిల్లల ఇమ్యూనిటీ పెంచే 9 బెస్ట్ ఫుడ్స్.. అస్సలు మిస్సవ్వొద్దు..
బాధితురాలు ఎదుర్కొనే ప్రయత్నం చేసినప్పటికీ, నిందితులు ఆమె నోటిలో గుడ్డను కుక్కి, చేతులు కట్టేసి అత్యాచారం(Rajasthan Gang Rape) చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు . వారిలో కొంతమంది ఆ దారుణ ఘటనను వీడియో తీసి, సోషల్ మీడియాలో పెడతామని బెదిరించారు. ఆమెను 11 రోజుల పాటు నిర్భంధంగా ఉంచి తర్వాత మూర్ఛిత స్థితిలో రోడ్డు పక్కన వదిలేశారు. స్థానికులు గమనించి ఆమెను తిరిగి ఇంటికి చేర్చారు. మొదట కుటుంబం పోలీసులను ఆశ్రయించినా, వారు ఫిర్యాదు నమోదు చేయడానికి నిరాకరించారు. అనంతరం బాధితురాలి కుటుంబం కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల మేరకు జూన్ 2న బాగద్ తిరాయ పోలీస్ స్టేషన్‌లో FIR నమోదైంది.
ఈ కేసు ప్రస్తుతం రామ్‌గఢ్‌కు చెందిన డిప్యూటీ ఎస్‌పీ సునీల్ కుమార్ శర్మ గారి పర్యవేక్షణలో దర్యాప్తు కొనసాగుతోంది. బాధితురాలికి వైద్య పరీక్షలు జరిపించనున్నారు, ఆమె వాంగ్మూలాన్ని మేజిస్ట్రేట్ ఎదుట రికార్డ్ చేయనున్నారు. నిందితులు ఇంకా పరారీలో ఉన్నారని, త్వరలో వారి అరెస్టు కోసం చర్యలు తీసుకుంటున్నామని పోలీసు అధికారులు తెలిపారు.