NTR:యంగ్‌టైగర్ ఎన్టీఆర్ గాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో చిత్రీకరిస్తున్న ఓ యాడ్ షూటింగ్లో ఆయన కాలికి స్వల్ప గాయమైంది. యాక్షన్ సన్నివేశాలు షూట్ చేస్తున్న క్రమంలో కిందపడిపోవడంతో హీరో గాయపడ్డారు. వెంటనే ఆయనను వ్యక్తిగత సిబ్బంది సమీపంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై ఎన్టీఆర్ టీమ్ ప్రకటన విడుదల చేసింది. వైద్యుల సలహా మేరకు పూర్తిగా కోలుకోవడానికి ఎన్టీఆర్ రెండు వారాల పాటు విశ్రాంతి తీసుకోనున్నారని తెలిపింది. ఆయన ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అభిమానులకు క్లారిటీ ఇచ్చింది. ఎన్టీఆర్ ఆరోగ్యంపై వస్తున్న ఊహాగానాలను ఎవరూ నమ్మొద్దని విజ్ఞప్తి చేసింది. ఎన్టీఆర్ త్వరగా కోలుకోవాలని ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు.ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ప్రస్తుతం ఓ హై ఓల్టేజ్ యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేస్తున్నారు. ఇటీవల ‘వార్2’తో ఎన్టీఆర్ ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే.
NTR:ఎన్టీఆర్‌కు ప్రమాదం… షూటింగ్లో కిందపడ్డ హీరో..
