SR కళాశాలలో విద్యార్ధిని అనుమానాస్పద మృతి

ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ నోట్
– కళాశాలలో చేర్చే ముందు ఒకసారి ఆలోచించాల్సింది అంటూ లేఖ

హనుమకొండ, తెలంగాణ చౌరస్తా: హనుమకొండ నయీమ్‌నగర్‌లోని ఎస్‌ఆర్‌ జూనియర్‌ కళాశాలలో చదువుతోన్న విద్యార్థిని అనుమానాస్పదంగా మృతి చెంది కలకలం రేపింది.మంచిర్యాల జిల్లాకు చెందిన మిట్టపల్లి శివాని (16) ఎం.పి.సి మొదటి సంవత్సరం విద్యార్థినీ,కళాశాల ప్రాంగణంలోనే మృతిచెందింది. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు ఎలాంటి సమాచారం లేకుండా కళాశాల యాజమాన్యం నేరుగా వరంగల్ ఎంజిఎం ఆసుపత్రి మార్చురీకి తరలించింది.ఈ చర్య పై శివాని కుటుంబ సభ్యులతో పాటు విద్యార్థులలోనూ తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.ఘటనాస్థలంలో ఒక సూసైడ్ నోట్ లభించింది.అందులో కళాశాలలో చేర్చే ముందు ఒక్కసారి ఆలోచించాల్సిందిలే అంటూ శివాని తన మనోవేదనను వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది.ఈ లేఖతో మరింత అనుమానాలు ముదిరాయి.పూర్తి విషయాలను వెలికితీసేందుకు పోలీసులు విచారణ ప్రారంభించారు.కళాశాల యాజమాన్యం నుంచి ఇప్పటివరకు అధికారిక స్పందన రాలేదు.విద్యార్థి సంఘాలు,తల్లిదండ్రులు ఈ ఘటనపై సీరియస్ గా స్పందిస్తూ,నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నాయి.